ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు.. వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:09 PM

యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు చేస్తూ సెలబ్రెటీల ప్రైవేసీకి భంగం కలిగిస్తున్న ఓ సినీ క్రిటిక్, యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి ట్రెండింగ్ టాఫిక్స్‌తో పాటుగా సినిమా, పొలిటికల్ సెలబ్రేటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలపై వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. జుగుప్సాకరమైన ఫోటోలు, థంబ్‌నెయిల్స్, కంటెంట్‌తో ఆ వీడియోలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత జైలుకు వెళ్లిన సమయంలోనూ కొన్ని వీడియోలు పోస్టు చేశాడు. కవితపై మహిళా ఖైదీలు దాడి చేశారంటూ వీడియోలు చేశాడు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పలువురు టాలీవుడ్ హీరోయిన్లకు లింకులు పెడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన తిరుమల లడ్డూ వివాదం, నాగార్జున, కొండా సురేఖ ఎపిసోడ్‌లో వాస్తవాలు ఇవే అంటూ కొన్ని అసత్య ప్రచారాలు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు దాసరి విజ్ఞాన్‌పై హైదరాబాద్ పోలీసులు సెక్షన్ 72 BNS, 356 (1) BNS 67 of IT Act 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


యూట్యూబర్ హర్షసాయికి మద్దతుగా..


ప్రేమ, సినిమా పేరుతో తనను మోసం చేసి శారీరకంగా వాడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఆ వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు కేసు పెట్టింది. కాగా, అప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.


ఈ నేపథ్యంలో హర్ష సాయికి మద్దతుగా దాసరి విజ్ఞాన్ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసాడు. బాధితురాలిదే పూర్తిగా తప్పంటూ అందుకు సంబంధించిన ఆడియోలు ఇవేనంటూ ఫేక్ ఆడియోలు యాట్యూబ్‌లో పెట్టాడు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. రేప్ కేసులో బాధితురాలిపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యూలేట్ చేస్తున్న వారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్, యూట్యూబ్, మెటాకి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హర్ష సాయికి సహకరిస్తున్న దాసరి విజ్ఞాన్‌ను అరెస్ట్ చేసారు. కాగా, అతడిపై ఇప్పటికే ఆరుకు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa