ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరాకు ప్రతిజ్ఞ చేద్దాం.. వాహనదారులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 01:47 PM

TG: వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక సూచనలు చేశారు. సగటున దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకు 20 మంది మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వీడియో సందేశం ద్వారా తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం, హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తాం అని ప్రతిజ్ఞ చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa