మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్లో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు. కాగా నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa