నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా అవసరమైన చర్యలకు కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై సోమవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ అయింది. ఈ మీటింగ్ లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖజానాకు అదనపు నిధుల సమీకరణపై ఈ సమావేశంలో చర్చించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులను తీర్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో కొత్త అప్పులను తగ్గించుకునేందుకు ఆదాయం సమకూర్చుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa