నాగార్జున సాగర్: ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య నాగార్జున సాగర్ వద్ద మరోసారి వివాదం చోటుచేసుకుంది. కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదుకు తెలంగాణ అధికారులు వచ్చారు. వీరిని ఏపీ అధికారులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై కేఆర్‌ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారమిచ్చారు. ఇరు రాష్ట్రాల అధికారులకు సాగర్ ఎస్‌ఈ కృష్ణమోహన్ శనివారం సర్దిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa