సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ ని బుల్డోజర్లతో తొక్కిస్తా కుక్క చావు చస్తావ్ అంటూ పిచ్చిగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్న.
సీఎం రేవంత్ భాష గీత దాటిపోతుంది, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు లేదు, మార్పు వస్తుందని ఆశించిన వారికి నిరాశ మిగిలి పైగా ఇప్పుడు నీ బాషా చూసి సాధారణ ప్రజలు కూడా విరక్తి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
రాజకీయాల్లో హుందా తనాన్ని ప్రజలు కోరుకుంటారు, ఇలాంటి తిట్లందుకుంటే తాత్కలికంగా కొంత మంది సంతోషపడవచ్చు కానీ దీర్ఘ కాలంలో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్ట దెబ్బ తిని ఎనలేని నష్టం వాటిల్లుతుంది.
మీ పార్టీ నాయకులు కూడా మీ బాటను అనుసరిస్తే రాష్ట రాజకీయాల్లో తిట్ల పురాణాలు మాత్రమే వినిపిస్తాయి, దయచేసి ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా మీ బాషా మార్చుకుంటే మంచిది లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నాం.