తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలని అనంతగిరి తాసిల్దార్ హిమబిందు కోరారు.మూడు రోజులపాటు ఎన్యూమరేటర్లు తొలుత కుటుంబాలను గుర్తించి ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి స్టిక్కర్లు అతికించారు.సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా శనివారం మండల పరిధిలో అమీనాబాద్ గ్రామంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా తాసిల్దార్ హిమబిందు సర్వే ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు మండల వ్యాప్తంగా 8 సూపర్వైజర్లు, 82 ఎన్యుమిటర్లతో సర్వే జరుగుతుందని మొత్తం మండలాలు సుమారు 11 వేల కుటుంబాలకు గాను.
కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలను నమోదు చేస్తారన్నారు.ప్రధాన ప్రశ్నలు 56, ఉపప్రశ్నలు 19 కలిపి మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారన్నారు.కుటుంబ సభ్యుల పేర్లతో పాటు అందరి మొబైల్ నంబరు సేకరిస్తారు.కులంతో పాటు ఆ కులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారాన్నారు.సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వస్తారని,అయితే వివరాల సేకరణలో భాగంగా కొన్ని పత్రాలు ఉంచుకుంటే వేగంగా సమాచారం సేకరణ పూర్తవుతుందని తహశీల్దార్ సూచించారు.ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, సెల్ ఫోన్ నెంబర్ల వంటివి అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు.ఎన్యూమరేటర్లు వచ్చే సమయానికి ఇబ్బందిపడకుందా ముందుగానే ఈ కాగితాలను సిద్ధం చేసుకుంటే వివరాలను కూడా సులభంగా చెప్పొచ్చని అన్నారు.ఇక మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుందనీ చెప్పారు.ఈ సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిందనీ,ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే తమ వివరాలను నమోదు చేయించుకోవచ్చని తెలిపింది.ఇందుకోసం సొంత గ్రామానికే వెళ్లాల్సిన పని లేదని,ఆధార్ పై ఉండే చిరునామా ఆధారంగానే వివరాల సేకరణ ఉంటుందని స్పష్టం చేశారు.