యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని చేవెళ్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వాడితే కలిగే నస్టాల గురించి అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకొంటాయన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే మత్తుకు బానిస అవుతారని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలపై అవగాహ పెంచుకొని గ్రామాల్లోని ప్రజలకు వాటి పరిస్థితి గురించి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు రమేష్ బాబు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.