విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి సహృదయంతో మనమందరం సహకరించాలని కాంగ్రెస్ పార్టీ గొల్లపల్లి గ్రామ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం గొల్లపల్లి, ఉదయ్ పూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలకు 50 కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫలితాలు సాధించాలంటే మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కోసం గ్రామస్తులందరూ సహకరించాలన్నారు. రాబోయే తరాలకు ఆస్తులు సంపద కంటే ముఖ్యంగా చదువును అందించాలని, అప్పుడే వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండుతాయన్నారు.విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు.
అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కింద కూర్చోకుండా వారికి కుర్చీలు బహుకరిస్తే వినియోగంలోకి రావడంతో పాటు చిన్నారులకు ఎంతో మేలు చేకూరుతుందని భావించి అంగన్వాడి కేంద్రాల చిన్నారులకు కుర్చీలను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకునే చిన్నారులకు కుర్చీలు అందించడం పట్ల బండారి శ్రీనివాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, అంగన్వాడి టీచర్ నర్సవ్వ,ఆశా వర్కర్ భాగ్యలక్ష్మి,నాయకులు మహేష్,శ్రీకాంత్, కుమార్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.