ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం, సీఐటీయు కార్యాలయాన్ని గురువారం సీపీఎం జాతీయ నాయకురాలు బృంద కారత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఐటీయు నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, సీఐటీయు జాతీయ కోశాధికారి సాయిబాబా, మాజి మంత్రి జోగు రామన్న, కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa