హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది. దట్టంగా మంచు అలుముకున్నన్నది. ఉదయం 8 గంటలు అయితే మంచు తెరలు వీడకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ముందు వెళ్తున్న వెహికల్స్ కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని జర్నీ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa