జనగామ జిల్లా పాలకుర్తిలో మినీ క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని. క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మార్కెట్ చైర్మన్లు, అధికారులు ఉన్నారు.