దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ జలాశయం నుండి కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.మాట్లాడుతూ గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తీసుకుని వచ్చి అదనపు ఆయకట్టుకు చాలా గ్రామాల రైతులకు సాగునీటిని అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.