ఆర్ అండ్ బి విభాగం వైఫల్యంతోనే నగరంలో పలుచోట్ల వర్షాకాలంలో వర్షపు నీరు ముంచెత్తుతోందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. బుధవారం కరీంనగర్ లోని 21వ డివిజన్ లో మంచినీటి పైపులైన్ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ లో మాట్లాడుతూ రూ. 35 లక్షల నిధులతో సుమారు 1400 మీటర్ల మంచినీటి పైప్లైన్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.