నల్గొండ జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో ప్రైస్ ఇవాంజెలికల్ చర్చ్ సిస్టర్ గుండ్లపల్లి విజయ కుమారి బంగారయ్య చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ బుధవారం పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామల్ల నరేష్ కుమార్, శాంతి స్వరూప్, అల్లంపల్లి కొండన్న, కొండేటి నరేష్ కుమార్, కాసర్ల లింగస్వామి, వంగూరు సునీల్ తదితరులు పాల్గొన్నారు.