దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 247.96 పాయింట్ల లాభంతో 78,720.83 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 68.55 పాయింట్లు లాభపడి 23,796.20 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.24 కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో SBI, ICICI బ్యాంక్, AXIS బ్యాంక్, HDFC బ్యాంక్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.