ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీ విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 07:48 PM

రాష్ట్రంలో 1,365 ఉద్యోగ ఖాళీలకు నిర్వహించిన గ్రూప్‌ -3 పరీక్ష ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.  మొత్తం మూడు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..  2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.  గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీపై జనవరి 12 సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలను తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేయాలని సూచించారు. ఈ-మెయిల్‌, వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టంచేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa