ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్ములా ఈ-రేసింగ్ కేసు అంశాలను తండ్రికి వివరించిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 07:09 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేతను కలిశారు. కేసీఆర్‌ను కలిసిన సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు అంశాలను వివరించారు. నిన్నటి ఏసీబీ విచారణకు సంబంధించిన వివరాలను కూడా కేసీఆర్‌తో పంచుకున్నారు. ఫార్ములా ఈ-రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో నిన్న ఆయనను ఏసీబీ విచారించింది. ఈ క్రమంలో నేడు ఆయన తన తండ్రిని కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa