దేవరకొండ మండలం బద్య నాయక్ తండాలో గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో టీం లీడర్ మాతృనాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల వారందరూ దరఖాస్తు ఫారంతో పాటు ఫోటో, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పుస్తకం జిరాక్స్ కాపీలను జత పరచాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa