బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన రైతు మహాధర్నాకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో ధర్నా స్థలమైన క్లాక్ టవర్ సెంటర్ గులాబీ మయమైంది. ఈ ధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ వస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగతం పలకడంతో అక్కడి ప్రాంతమంతా గులాబీ మయమైంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీకు సిగ్గుందా వెంకటరెడ్డీ? భూపాల్ రెడ్డిపై పోలీసులతో దాడి చేయిస్తావా? నీకు దమ్ముంటే నల్గొండ గడియారం సెంటర్కి రా. మాలాగే మీటింగ్ పెట్టు. ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు. ఉత్తమ్, వెంకటరెడ్డికి ఆకారాలు, అహంకారాలు పెరిగాయి తప్ప వారు నల్గొండకు చేసిందేమీ లేదు' అని విమర్శించారు నల్లగొండకు మూడు మెడికల్ కాలేజీలు, దామరచర్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేస్తే నలగొండ రాష్ట్రంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్ ది అని ,యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట అద్భుతంగా తీర్చిదిద్దిన నేత కేసీఆర్ అని, మళ్లీ రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే అని , వైయస్సార్ అంటే ఆరోగ్యశ్రీ, కేసీఆర్ అంటే రైతు బంధు అని, ఎల్లప్పుడూ రైతుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు.
కాంగ్రెస్ వారికి వడ్డీతో చెల్లిస్తామని, తెలంగాణ రాష్ట్రం రైతన్న మద్దతుతో ఏర్పడ్డదని కేసీఆర్ నాట్లప్పుడు రైతుబంధు వేస్తే ,రేవంత్ రెడ్డి ఎన్నికల అప్పుడు మాత్రమే ఓట్లు కోసం రైతుబంధు వేస్తున్నారని ,మోసపూరిత మాటలతో గట్టెక్కిన కాంగ్రెస్ అని నల్లగొండ ఉద్యమాల గడ్డ ,గడ్డపై గులాబీ జెండా ఎగడం ఖాయమని తెలిపారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులను కలిసి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు ఎవరు అధైర్య పడవద్దు అని త్వరలోనే సమాధానం చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ,సత్యవతి రాథోడ్ ,మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, నల్లబోతు భాస్కరరావు, కుసుకంట్ల ప్రభాకర్ రెడ్డి, బాల్క సుమన్, నోముల భగత్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa