ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 07:50 PM

తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక మాడల్ డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు ఈ నివేదిక ప్రాతిపదికగా పనిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి .తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన’ (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) ను ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అనంతరం ముఖ్యమంత్రి గారు సర్వేపై సమగ్రంగా వివరిస్తూ ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ వేదికగా ప్రకటన చేశారు.రాష్ట్రంలో 46.25 శాతం ఉన్న బీసీలు, మైనారిటీల్లోని బీసీలు కలుపుకుని 56.33 శాతం ఉన్న బీసీలందరికీ సమాజంలో సముచితమైన గౌరవం, స్థానం కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టాం. ఈ సర్వే నివేదికకు పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశంతో కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి ఉపసంఘం ద్వారా మంత్రిమండలి ఆమోదించింది.సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే 2024 నివేదికను ఈ శాసనసభలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నాకు జీవిత కాలం గుర్తిండిపోయే సందర్భం.అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తరగతి ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ సర్వే చేపట్టడం జరిగింది.తెలంగాణ గౌరవ గవర్నర్ గారితో మొదలుపెట్టి, రాష్ట్రంలో 6 నవంబర్ 2024 న సర్వే ప్రారంభించిగా 25 డిసెంబర్ 2024 నాటికి పూర్తయింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 నగర ప్రాంతాల్లో 45,15,532 కాగా మొత్తం 1,12,15,137 కుటుంబాలు (96.09 శాతం) ఉంది. సరిగ్గా ఏడాది కాలంలో పూర్తి చేసి నివేదికను శాసనసభ ముందుకు తెచ్చాం.సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), ఎస్టీల్లో 37,05,929 (10.45 శాతం), బీసీలు 1,64,09,179 (46.25 శాతం) ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 (10.08 శాతం) ఉంది. ముస్లిం మైనారిటీ బీసీలను కలుపుకుంటే తెలంగాణలో మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉంది.రాష్ట్రంలో మైనారిటీ జనాభా 44,57,012 (12.56 శాతం) ఉండగా, ముస్లిం మైనారిటీల్లో ఓసీలో 80,424 (2.4 శాతం) ఉంది. హిందూ ఓసీలు 13.31 శాతం ఉంది. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలను కలుపుకుంటే మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం ఉంది.ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాల రూపకల్పనలో ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ సమగ్ర సర్వే తెలంగాణ నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సర్వే సమానాభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను, తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది.దేశంలో గత 75 ఏళ్లుగా ఎన్నో విజ్ఞప్తులు వచ్చినప్పటికీ బలహీన వర్గాలు, ఇతర కులాలు, ఉప కులాలకు సంబంధించిన వివరాలను సేకరించలేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు.మా ప్రభుత్వం 7 డిసెంబర్ 2023 అధికారం చేపట్టిన వెంటనే బీసీ వర్గాల జనాభా లెక్కలు తేల్చాలన్న చిత్తశుద్ధితో 4 ఫిబ్రవరి 2024 నాడు మంత్రివర్గంలో ఆమోదం పొంది సమగ్ర సర్వేపై 6 ఫిబ్రవరి 2024 శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం.ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడంతో, అలాంటి తప్పిదం జరగరాదని, సర్వే పకడ్బంధీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం... అని ముఖ్యమంత్రి గారు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa