స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో కల్వకుంట్ల కవిత మెమోరాండం సమర్పించిన జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిసిల జనాభాను తగ్గించి చూపుతూ కులగణన చేపట్టారు. గతంలో బిసిలు 56% ఉంటే ప్రస్తుతం సర్వేలో 46% చూపించి బిసిల జనాభాను తగ్గించారు. కులగణనను, బిసిల జనాభాను ఎందుకు తక్కువ చేసి చూపించారు. గత సమగ్ర కుటుంబ సర్వేలో లెక్కలతో పోలిస్తే ఇప్పుడు బిసిల జనాభా ఎందుకు తగ్గింది. తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరే కాకుండా 62 లక్షల మంది ఒకటవ తరగతి నుండి 17 ఏళ్ల వయసు వారు ఉన్నారు. వీరందరితో కలిపి 4,33,29,722 బిసిలు ఉన్నారు. కానీ కులగణన సర్వేలో తక్కువ చూపించారు. కావున సర్వే జరగని ప్రాంతాల్లో తిరిగి రీసర్వే జరిపించాలని బిసి సంఘం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బిసిలు ఉన్నారు. తమిళనాడు సలహాలు కేంద్రాన్ని ఒప్పించి బిసిలకు 42% రిజర్వేషన్ కల్పించి దానికి చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కామారెడ్డిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బిసి లకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి. బిసిలకు బిసి ఫెడరేషన్లు బిసి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బిసి లకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించి అంతరించిపోతున్న బిసి కుల వృత్తులను ఆదుకోవాలి. కేంద్రంలో జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలి దేశంలోని ప్రతి సామాజికవర్గాలవారికి వారి వారి జనాభా అనుగుణంగా విద్య, ఉద్యోగ రాజకీయరంగాల్లో ప్రాతినిథ్యం కల్పించాలి. 75 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, వాటా ఎందుకు ఇవ్వడం లేదు. బిసి లకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం ప్రకారం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
1) కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
2) బిసి లకు స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బిసికి సబ్సిడీతో కూడిన రుణాలను అందజేయాలి.
3) కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.
4) బిసి లకు ఇస్తున్న హామీలకు చట్టబద్ధత కల్పించాలి.
5) బిసి కులవృత్తులకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి.
6) బిసి ల జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అనుమల్ల సంజయ్ సామ్రాట్, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, జగిత్యాల బిసి సంఘం దుబాయ్ ఎన్నారై, యాగండ్ల రమేష్ గౌడ్, కాసారం సతీష్ గౌడ్
పాలెం జలంధర్హరీష్ గౌడ్ బిసి సంఘం రొట్టె శ్రీధర్, లింబాద్రి గౌడ్, ఆంజయ్య, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బండపెల్లి నర్సయ్య, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa