ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి వాళ్లందరి ఖాతాల్లో డబ్బులు జమ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 07:24 PM

జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తొలుడు పైలెట్ ప్రాజెక్టు కింద జనవరి 27న 563 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా.. ఆ తర్వాత ఒక్క ఎకరా ఉన్న రైతులకు, రెండు ఎకరాలున్న అన్నదాల అకౌంట్లలో డబ్బు జమ చేసింది. కాగా.. ఇప్పుడు మూడు ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది.


కాగా.. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. రూ.2223.46 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా.. సాగు చేస్తున్న భూమిని (ఎకరాల్లో) బట్టి వరుసగా పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. మార్చిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేశారు.


అయితే.. రైతు భరోసా పథకం ప్రారంభించిన వెంటనే జనవరి 27వ తేదీన 563 గ్రామాల్లోని 4,41,911 రైతులకు సంబంధించి 9,48,332.35 ఎకరాలకు పెట్టుబడి సాయం కింద రూ.5,68,99,97,265 నిధులు విడుదల చేసింది ప్రబుత్వం. అనంతరం.. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఎకరం సాగు భూమి ఉన్న 17,03,419 మంది రైతులకు చెందిన 9,29,234.20 ఎకరాలకు రూ.5,57,54,07,019 నిధులు విడుదల చేసింది సర్కార్.


ఇక ఫిబ్రవరి 10వ తేదీన రెండెకరాల సాగు భూమి ఉన్న 8,65,999 మంది రైతులకు చెందిన 11,79,247.17 ఎకరాలకు గానూ రూ.7,07,54,84,664 జమ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కాగా.. మొన్నటి వరకు మొత్తంగా 30,11,329 రైతులకు చెందిన 30,56,814.32 ఎకరాలకు రూ.1834,08,88,948 పెట్టుబడి సాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమచేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా.. మూడు ఎకరాల సాగు భూమి ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొనటంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa