ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్ మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 20, 2025, 11:54 AM

కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడుదీంతో, కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.వివరాల ‍ప్రకారం.. కానిస్టేబుల్‌ రవి గాంధారి మండల కేంద్రంలో విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడే ఉన్న రవిని ఢీకొట్టింది. ఈ క్రమంలో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రవితో పాటు విధులు నిర్వహిస్తున్న సుభాష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa