ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బట్టతల ఉందని పెళ్లి కాన్సల్ చేసిన యువతి, అవమానంతో యువకుడు ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 11:30 AM

వివాహ సమయం దాటిపోతున్న కానీ వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన ఓ వైద్యుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... గుజరాత్‌ కు చెందిన ప్రకాష్‌ మాల్‌ కుటుంబంతో సహా సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు. ఆయన చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పురోహిత్ కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. అయితే, పురోహిత్ కు బట్టతల ఉండటం, ఇతర కారణాల వల్ల అమ్మాయి కుటుంబం ఈ వివాహాన్ని రద్దు చేసుకుంది. ఇప్పటికే 34 ఏళ్లు వచ్చాయని, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దయిందని పురోహిత్  ఆవేదనతో బుధవారం ఉదయం  క్యావలరీ బ్యారక్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్‌ ఈ విషయాన్ని గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa