సూర్యాపేట జిల్లా కోదాడ పీఎస్ వద్ద శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు దగ్ధం అయినట్లు అధికారులు వెల్లడించారు.
గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను కాల్చేందుకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa