బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ షాక్ ఇచ్చింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఇకపై టీజీపీఎస్సీపై రాకేశ్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఆ నోటీసుల్లో పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టవద్దని కూడా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa