దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మునుపటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లను సాధించేందుకు మే 20న జరుగనున్న సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు ఏఐటీయూసీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో, శాద్నగర్ బస్టాండ్ కూడలిలో గోడ పోస్టర్లను విడుదల చేసే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ, "కార్మిక హక్కులను కాలరాసే ఫోర్ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. కార్మికులకు రక్షణ కలిగించే 29 చట్టాలను తిరిగి అమలు చేయాలి," అని డిమాండ్ చేశారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. శ్రీను అధ్యక్షత వహించారు. మే 20న జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని, కార్మికులు, ప్రజాసంఘాలు అందరూ ఇందులో పాల్గొనాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa