తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ సోమవారం వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఆ తరువాత, డా. బండ ప్రకాశ్ స్వామివారికి కోడె మొక్కు చెల్లించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కళ్యాణమండపంలో అర్చకులు ఆయనకు వేదోక్త ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కె. వినోద్ ఆయనకు శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్శనలో డా. బండ ప్రకాశ్ భక్తివిశ్వాసాలతో పాల్గొని, రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa