ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుద్రూర్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల అవగాహన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 01:32 PM

అంబం(ఆర్) గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు. 
అలాగే, ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు, వాహనదారులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa