కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని యథాతథంగా కొనసాగించేందుకు రూ.15,642 కోట్లు కేటాయించింది.
రుణ పరిమితి:
పంట సాగుకు రూ.3 లక్షల వరకు
అనుబంధ కార్యకలాపాలకు రూ.2 లక్షల వరకు
దరఖాస్తు: అన్ని బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వడ్డీ రాయితీ:
7% వడ్డీతో రుణం తీసుకున్న రైతులు సకాలంలో చెల్లిస్తే 3% రాయితీ (బ్యాంకులకు 1.5% అదనంగా) అందుతుంది.
ఫలితం: రైతులకు కేవలం 4% వడ్డీతో రుణం అందుబాటులో ఉంటుంది.
ఈ నిర్ణయం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి, వ్యవసాయ కార్యకలాపాలకు మరింత ఊతం ఇవ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa