జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నిత్య జనగణమన సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆనందంగా ఎగరవేసి, జాతీయ గీతాన్ని గౌరవంగా ఆలపించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రంజిత్ కుమార్ మల్లేశం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa