కరీంనగర్ జిల్లా మారుతినగర్‌కు చెందిన నిమ్మల చందు, సుమలత దంపతులు ఆరు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. వారికి మనస్వి అనే కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ బాలికకు కుటుంబ సభ్యులు ఒక భావోద్వేగ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మనస్వి ఒక ఫంక్షన్‌లో ఉన్న సమయంలో, కుటుంబ సభ్యులు AI సాంకేతికతతో తయారు చేసిన ఒక వీడియోను హాల్‌లోని స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ వీడియోలో మనస్వి తల్లిదండ్రులు సజీవంగా కనిపించి, ఆమెతో మాట్లాడినట్లుగా ఉండటంతో, ఆమె ఒకవైపు ఆనందంతో, మరోవైపు విషాదంతో కన్నీటిపర్యంతమైంది. ఈ హృదయస్పర్శి ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. AI సాంకేతికత ద్వారా ఇలాంటి భావోద్వేగ క్షణాలను సృష్టించడం అందరినీ ఆకర్షించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa