పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. గురువారం సూర్యతండా, దేవరకొండ పురపాలికలోని అయ్యప్ప నగర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా పేదలు ఎదురుచూస్తున్న సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని, అభివృద్ధి మరియు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పలువురు నాయకులు, లబ్ధిదారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa