కొండమల్లేపల్లి మండల కేంద్ర శివారులోని ఎస్పిఆర్ పాఠశాల ప్రభుత్వ అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ ఏఐఎస్ఎస్ నేత వినోద్ నాయక్ గురువారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)కు ఫిర్యాదు చేశారు.
ఈ పాఠశాల గుర్తింపు పొందిన పాఠశాల పేరుతో కాకుండా, ఎస్పిఆర్ పేరిట అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టి మోసం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని వినోద్ నాయక్ ఎంఈఓను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa