హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాల విస్తీర్ణంలో నిర్మించిన మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయం ఒకేసారి 72 కార్లను సమర్థవంతంగా నిల్వ చేయగలదని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాకర్స్‌కు ఈ కొత్త సౌకర్యం ఊరటనిచ్చేలా ఉంది.
కొరియన్ టెక్నాలజీతో రూపొందిన ఈ మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణానికి రూ. 6 కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌లో ఉన్న ఈ సదుపాయం 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, పార్కింగ్ సమస్యలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ చర్యలు పూర్తిగా అమలులోకి వస్తే, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు గణనీయంగా చెక్ పడనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa