ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కార్యాచరణపై బుధవారం రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో రేపు సా.4. గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్ కి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ఉత్తమ్ వివరించారు.అఖిలపక్ష ఎంపీలను అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటుగా స్వయంగా ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి – బంకచర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చర్చించనున్నట్లు, అందులో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa