హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో దూసుకెళ్లిన కారు ఉషా కంపెనీ ముందు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారులోని నలుగురు ప్రయాణికుల్లో ముస్తాక్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa