TG: పాశమైలారం అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (HRC) సుమోటోగా స్వీకరించింది. జులై 30లోగా ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, ఫైర్ డీజీ, సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి HRCకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమికల్ పరిశ్రమల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa