నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ లారీ డ్రైవర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, ఫర్వేజ్ ఖాన్ (32) అనే లారీ డ్రైవర్, ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణ స్థలానికి సిమెంట్ లోడ్ తీసుకెళ్లాడు. అప్పట్లో అతను లారీని రివర్స్ తీస్తుండగా, ప్రమాదవశాత్తు వెనక ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్నాడు. ఈ దెబ్బతో అతడు తీవ్రంగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
ఈ ఘటనతో అక్కడి వాతావరణం విషాదంగా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, అపార్ట్‌మెంట్ నిర్మాణ కార్మికులు అతడిని రక్షించే ప్రయత్నం చేసినా ఫర్వేజ్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa