అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బాల్తాల్ మార్గంలో రైల్‌పత్రి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 36 గంటల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక యాత్రికుడు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి SDRF అధికారులు చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa