TG: ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని పేర్కొన్నారు. అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని అన్నారు. ఇవాళ ఢిల్లీలో కులగణనపై జరిగిన ప్రజెంటేషన్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని రేవంత్ తెలిపారు. తాను బీసీ నేతను అని ప్రధాని మోదీ పదేపదే చెప్పుకుంటున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa