ఏ నాలాను చూసినా టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త బయట పడుతోంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద నీటిని తీసుకువచ్చే నాలా పరిస్థితీ అంతే. ఎంత తీసినా తరగనంత చెత్త బయటపడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నాలాను హైడ్రా పరిశుభ్రం చేస్తోంది. టోలీ చౌక్ వద్ద హకీంపేట ప్రాంతంలో బుల్కాపూర్ నాలాను రెండు రోజుల పాటు హైడ్రా సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. దీంతో ఈ నాలా పరిస్థితి హైడ్రా చర్యలకు ముందు.. తర్వాతలా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa