TG: ముఖం బాగాలేక అద్దం పలగ్గొట్టుకున్నట్టు రేవంత్ తీరు ఉన్నదని KTR విమర్శించారు. కామారెడ్డి(D) లింగంపేట్ ఆత్మగౌరవ గర్జన సభలో పాల్గొని మాట్లాడారు. 'పాలించేటోనికి దమ్ముంటే ఆదాయం, సంపద పుడుతుంది. కరోనా సమయంలో ఏ ఒక్క పథకాన్ని KCR ఆపలేదు. అంబేద్కర్ జయంతి నాడు సాయిలు అన్నకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమకారులకు, దళిత సమాజానికి జరిగిన అవమానం. ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించి తీరుతాం' అని ఫైర్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa