కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు గాయాలు కావడంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి, ఆ గుంతలలో నీరు ఉండటంతో రోడ్డు కనపడక ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి ఆ గుంతలు పూడ్పించాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa