పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ లో గల శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ, "సమాజంలో శాంతి, శ్రేయస్సు, మరియు ప్రజల సంక్షేమానికి ఇలాంటి దేవాలయాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa