కర్ణాటకలోని ధర్మస్థలలో జరిగిన సామూహిక ఖననం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ధర్మస్థల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చినట్టు సమాచారం ఇచ్చిన ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 13 ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. ఫోరెన్సిక్ బృందం అవశేషాలను ల్యాబ్‌కు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa