జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికులకే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గురువారం ఖండించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో 100 పులులు ఉంటాయి. అయితే ఏ పులి శక్తివంతమైనదో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అలాగే వయనాడ్ లో గెలిచిన రాహుల్, ప్రియాంక లకు సొంత ఇళ్లు లేదు కదా అని గుర్తు చేశారు. ఉప ఎన్నికల బరిలో ఎవరుండాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa