తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలుใ బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ ใ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు ఖచ్చితంగా విధుల్లో ఉండాలని సూచించిన మంత్రి ใ అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ใ అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి రోగులను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్న మంత్రి దామోదర రాజనర్సింహ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa