జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఐక్యతతోనే విజయాన్ని సాధించగలమని, సమాజ అభివృద్ధి, శాంతి భద్రతల కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa